రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హేగ్డే ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా రాధేశ్యామ్. ఈసినిమా మార్చి11న ప్రేక్షుకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తో పాటు ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. అందంగా రాసుకున్న రాధకృష్ణ ప్రేమకథ, దానికి తోడు విజువల్స్, ఇంకా సంగీతం ఇలా అన్నీ ఈసినిమాకు కలిసొచ్చాయి. ఇక వాటికి తోడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో నటించిన పూజా హెగ్డే నటనే ఈసినిమాకు ప్రధాన బలమైంది. వారిద్దరితో ఒక అద్భుతమైన ప్రేమకథని వెండితెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ రాకపోవడంతో ఆడియన్స్ కు కూడా ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది. సినిమా చూసిన ఆడియన్స్ కు రీఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈసినిమా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందంటే మాములు విషయం కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాాజాగా డైరెక్టర్ రాధాకృష్ణ మరోసారి ఈసినిమా విజన్ ఎంటో తన ట్విట్టర్ ద్వారా ఒక ఫొటో పోస్ట్ చేస్తూ మరి తెలిపాడు. తను షేర్ చేసిన ఫొటోలో రాధాకృష్ణుల ఫొటోతో పాటు ప్రభాస్ పూజా హెగ్డేలు కూడా ఉన్నారు. అయితే రాధా పాదాలను తాకుతూ కృష్ణుడు కింద కూర్చొని ఉండగా.. అలానే ప్రభాస్, పూజా హెగ్డే ల పిక్ ను జోడించి పోస్ట్ చేసి దానికి ఉన్నంత కాలం భూమి ఆకాశం నిలిచేటి గాథే ఈ రాధే శ్యామ్” అని క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఆ రాధాకృష్ణుల ప్రేమ లాంటిదే ఈ రాధేశ్యామ్ అని ఈసినిమా అందమైన ప్రేమకావ్యం అంటూ మరోసారి చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Unnantha kaalam bhoomi aakaasham nilicheti gaadhe ee #radheshyam pic.twitter.com/1lnliql3if
— Radha Krishna Kumar (@director_radhaa) March 15, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: