బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ఆంధ్రా పోరి, మెహబూబా సినిమాలతో హీరోగా పరిచయమయ్యాడు ఆకాష్ పూరి. ఇటీవల రొమాంటిక్ సినిమాతో వచ్చినా ఆ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో మరో సీనియర్ నటి కూడా భాగం కాబోతున్నారు. ఆ నటి ఎవరో కాదు అర్చన. నిరీక్షణ సినిమాలో నటించిన అర్చన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన అందం, అభినయంతో జాతీయ పురస్కారంతో పాటు ఎందరో ప్రముఖుల మన్ననలు అందుకున్నారు అర్చన. ఇంకా భారత్ బంద్, లేడీస్ టైలర్, చక్రవ్యూహం, పచ్చతోరణం, మట్టి మనషులు తదితర చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయితే తెలుగు సినిమాలకు అర్చన కొన్నేళ్ల క్రితమే దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సుమారు పాతికేళ్ల తర్వాత ఈసినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం ఓ వీడియో విడుదల చేస్తూ తెలియచేశారు.
Welcome #UrwasiArchana Garu On board #ChorBazaar after 25 years.
Hearty Welcome to #TFI@IVProductions_ @ActorAkashPuri @Vsraju_subbu @gehna_sippy pic.twitter.com/VS6U2OjzbH— B.Jeevan Reddy (@GeorgeReddyG1) March 1, 2022
కాగా లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. ఈసినిమాలో గెహన సిప్పీ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా ఈ సినిమాలో సుబ్బరాజు, పోసాని, లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: