నవ్వుల రైడ్ ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతా కలిసి గతంలో కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తయింది.. ఒక్క పాట చిత్రీకరణ మాత్రం పెండింగ్ లో ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రం స్పీడుగా జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకుని మే 27 థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఎఫ్3 -సమ్మర్ సోగ్గాళ్ళు పోస్టర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. వరుణ్‌తేజ్ నిలుచొని కళ్ళద్దాలతో స్టయిలిష్‌గా వుంటే అంతే ఎట్రాక్ట్‌గా వెంకటేష్ లుక్స్ సమ్మర్ సోగ్గాళ్ళుగా మీ ముందుకు వచ్చేస్తున్నాం అన్నట్లు పోస్టర్ వుంది. సోషల్ మీడియాలో దీనికి మంచి స్పందన లభిస్తోంది.
కాగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: