గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
” రాధేశ్యామ్” మూవీ వినూత్న ప్రచారానికి చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలో జోతిష్యం, హస్తసాముద్రికం తదితర అంశాలకు సంబంధించి చాలా హనెస్ట్‌గా ఓ విషయాన్ని చెప్పామని దర్శకుడు రాధాకృష్ణ వెల్లడిస్తూ . పెద్ద పెద్ద వారికి పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ నటించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసి.. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. “రాధేశ్యామ్ ” విడుదలయ్యే ప్రతి థియేటర్ వద్ద ఆస్ట్రాలజీ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: