సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “భీమ్లానాయక్ ” మూవీ హవా నడుస్తుంది. రెండు ట్రైలర్స్ తో హైప్ క్రియేట్ అయిన “భీమ్లానాయక్ ” మూవీ బెనిఫిట్ షో తోనే ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్ సీస్ లో “భీమ్లా నాయక్ ” రెండు రోజులకు బ్రేక్ ఈవెన్ కు చేరుకొని 2 మిలియన్ డాలర్స్ దిశగా దూసుకుపోతోంది. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పాత్రలో కనిపించడం పట్ల సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: