పూరీ జనగణమన కోసం ‘విజయ్’ మేకోవర్..!

Vijay Deverakonda Makeover for Puri Jagannadhs Janaganamana,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Upcoming Movie,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda New Movie Janaganamana,Vijay Deverakonda New Movie with Janaganamana, Puri Jagannadh confirms Janaganamana,Vijay Deverakonda Pan India Movie,Vijay Deverakonda Army Person In New Movie,Vijay Deverakonda and Puri Jagannadh,Vijay Deverakonda make Over in His Upcoming Movie, Vijay Deverakonda New Make Over For Puri Jagannadhs Janaganamana,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Movies in 2022,Vijay Deverakonda Latest Super Hit Movies,Vijay Deverakonda liger Movie Updates, Vijay Deverakonda Janaganamana Movie Updates,#VijayDeverakonda,#Janaganamana,#purijagannadh

పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. అర్జున్ రెడ్డి సినిమాతో తన మార్క్ ను చూపించాడు విజయ్ దేవరకొండ. ఇక పలు డిఫరెంట్ పాత్రలతో.. సినిమా సినిమాకు తన మేకోవర్ ను మార్చుకుంటూ మంచి విజయాలు సాధించడమే కాకుండా యూత్ లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ పూరీ డైరెక్షన్ లో లైగర్ సినిమాను చేస్తున్నాడు. ఈసినిమాలో బాక్సర్ గా డిఫరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా లైగర్ తరువాత పూరీ జగన్నాథ్, విజయ్ కాంబినేషన్ లో ‘జనగణమన’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా కోసం విజయ్ అప్పుడే రెడీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. కొత్త మేకోవర్ కోసం జిమ్ లో కసరత్తులు కూడా మొదలుపెట్టాడట. ఈసినిమాలో మిలిటరీ పర్సన్ గా కనిపించనుండగా దానికి తగినట్టుగా పాత్ర కోసం రెడీ అవుతున్నాడట విజయ్.

కాగా ఈసినిమాను కూడా పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ నిర్మిస్తున్నారు. ఈసినిమా కూడా ఈ పాన్‌ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పూరీ కూడా దాదాపు స్క్రిప్ వర్క్ ను పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ ఏప్రిల్‌లో స్టార్ట్‌ చేసేలా చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని టాక్‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − seven =