పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చూసిన గ్లింప్స్ కానీ, పాటలు, టీజర్, ట్రైలర్ లను బట్టి ఈ మూవీ ఓ విజువల్ వండర్ గా వుండబోతోందన్న విషయం మాత్రం అర్థమవుతుంది. నిజానికి ఈ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. దీంతో మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఈ రాతలే ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఫుల్ సాంగ్‌ని విడుదల చేశారు. జస్టిస్ శంకర్ మ్యూజిక్ అందించగా ఈపాటను యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. ఇక ఈపాట అందరినీ ఆకట్టుకుంటుంది. `ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా.. అంటూ సాగిన ఈ పాటలోని ప్రతీ ఫ్రేమ్ .. పాటలో కనిపించిన విజువల్స్ అద్భుతంగా వున్నాయి.
When hearts meet, melody is created! Presenting a romantic treat from #MusicalOfAges ♥️#JaanHaiMeri: https://t.co/j8w9HYwCft#EeRaathale: https://t.co/zI2JMmnJxt#Aagoozhilae: https://t.co/S24GzS9nHJ#EeReethile: https://t.co/gDbnxY1KCA#Kaanaakkare: https://t.co/bWJt4yb7JQ pic.twitter.com/0a95smMhom
— UV Creations (@UV_Creations) February 25, 2022
కాాగా ఈసినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్డే నటిస్తుంది. ఇక ప్రభాస్ కూడా హస్త సాముద్రిక నిపుణుడిగా ఇప్పటివరకూ తన కెరీర్ లో చేయని పాత్రను చేస్తున్నాడు. బల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస అనే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యువి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో విడుదల కానున్న ‘రాధేశ్యామ్’ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: