‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు చేశారు. కేవలం హీరోగా మాత్రమే కాదు.. విలన్ గా పలు పాత్రలు చేశారు. అంతేకాదు నిర్మాతగా పలు సినిమాలు కూడా నిర్మించారు. ఇక గతకొంతకాలంగా హీరోగా సినిమాలు చేయకపోయినా.. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తుంది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం.
ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. ఇళయరాజా సంగీత అందిస్తుండగా.. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: