శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో గూఢచారి సినిమా రాగా ఇది రెండో సినిమా. ఈసినిమా ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం అడివి శేష్ చాలా రీసెర్చ్ కూడా చేశాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా అది ఎంత బాగా ఆకట్టుకుందో చూశాం. అయితే ఈసినిమాను కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందరూ కొత్త సినిమా రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో మేజర్ టీమ్ కూడా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈరెండు నెలలు పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉండటంతో మేజర్ ను సమ్మర్ కు షిప్ట్ చేశారు. మే 27వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
THIS. SUMMER. WILL. BE.
MASSIVE.#MajorTheFilm WORLDWIDE on 27 May, 2022 🔥🔥#MAJOR ka promise hai Yeh. #MajorOnMAY27 pic.twitter.com/aky5skkJee
— Adivi Sesh (@AdiviSesh) February 4, 2022
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: