రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఇప్పుడు అదే జోష్ తో తన తరువాత ప్రాజెక్ట్స్ ను కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాల్లో అంటే సుందరానికిి మరొకటి దసరా కూడా ఉన్నాయి. వీటిలో అంటే సుందరానికి సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను స్టార్ట్ చేసినా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్యే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. అందరూ రెండు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేస్తుంటే అంటే సుందరానికి మేకర్స్ మాత్రం ఏకంగా ఏడు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 22, ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 రిలీజ్ డేట్లను ఫిక్స్ చేస్తూ.. మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా.. ఫుల్ అవకాయ సీజన్ బ్లాక్.. మెల్లగా డిసైడ్ చేస్తాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మరి చాలా టైమ్ ఉంది కాబట్టి ఈ ఏడు డేట్లలో ఏ డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి.
కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో వస్తున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: