జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా , జిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజిత్ హీరో గా , తెలుగు హీరో కార్తికేయ విలన్ గా పోటీపడి నటించిన “వాలిమై” మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 13న రిలీజ్ కావల్సి ఉండగా కరోనా కారణంగా సినిమా రిలీజ్ ను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా “వాలిమై ” మూవీ ఫిబ్రవరి 24 వ తేదీ తమిళ భాషతో పాటు తెలుగు , హిందీ ,కన్నడ భాషలలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ: కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొందనీ , కాస్త సానుకూల వాతావరణం ఏర్పడటంతో “వాలిమై” మూవీ ని ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేసామనీ , ఈ మూవీ లో హీరో అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ గా నటించారనీ , అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం తెరకెక్కిందనీ , అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా దర్శకుడు వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారనీ , ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయనీ , ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటించారనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: