టాలీవుడ్‌లో చాలా కొద్ది మంది హీరోలు మాత్రమే వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలాంటి హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే శ్రీవిష్ణు చేసిన ప్రతి సినిమా వైవిధ్యంగానే ఉంటుంది. ఇక ఇప్పుడు మరో కొత్త కథతో వచ్చేస్తున్నాడు.‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా భళా తందనాన. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కూడా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటుంది. రాక్షసుడిని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి.. నేను మాములు మనిషిని అన్న శ్రీవిష్ణు డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. టీజర్ మొత్తం సీరియస్ మోడ్ లోనే కట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక టీజర్ చివరిలో సీఎం కుర్చీలో కూర్చున్న ఎవరైనా ఒక్క సంతకంతో ఎవరి ఫ్యూచరైనా మార్చేయోచ్చు.. అంటే పవర్ చేతిదా లేక కుర్చీదా అన్న డైలాగ్ హైలెట్ గా ఉంది. చూడబోతే కాస్త పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలాగ అనిపిస్తుంది. మొత్తానికి టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు శ్రీవిష్ణు..
Happy to launch the teaser of #BhalaThandhanana
A very talented team 🙂
Wish you guys a huge success 🤗#BhalaThandhananaTeaser: https://t.co/BjPxy9sTsI@sreevishnuoffl @chaitanyahead @CatherineTresa1 @SaiKorrapati_ #ManiSharma @GarudaRaam @SrikanthVissa @VaaraahiCC— Nani (@NameisNani) January 28, 2022
కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ గా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: