కరోనా థర్డ్ వేవ్ వల్ల సినీ పరిశ్రమకు మళ్లీ బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అనుకునే లోపే మళ్లీ థర్డ్ వేవ్ ప్రభావం పెరిగిపోతుంది. రోజు రోజుకి కేసులు పెరిగిపోతుండటంతో మళ్లీ లాక్ డౌన్ లు మొదలయ్యాయి. ఇక మరోవైపు థియేటర్లు కూడా మూసేస్తున్నారు. దీంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇప్పటికే పెద్ద సినిమాలు తప్పుకున్నాయి.. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా వాయిదాల పర్వం మొదలుపెట్టాయి. ఇప్పటికే 7డేస్ 6నైట్స్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడు మరో సినిమా ఈ రేస్ నుండి తప్పుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘ డీజే టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఎక్కువవడంతో రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువవడం.. కేసులు పెరుగుతుండటంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నాం అంటూ చిత్ర నిర్మాణసంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Hang in there, to experience the crazy fun ride in theatres just when it’s the time. Until then everyone #MaskUp & #StaySafe
#DJTillu #DJTilluPostponed @siddu_buoy @MusicThaman @iamnehashetty @K13Vimal @vamsi84 @SricharanPakala @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/roKmFwTedn
— Sithara Entertainments (@SitharaEnts) January 10, 2022
కాగా ఈసినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ప్రిన్స్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: