సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట ” మూవీ లో నటిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న “సర్కారు వారి పాట ” మూవీ 2022 ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మంచి విషయాలకు స్పందించి మహేష్ బాబు ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ట్వీట్స్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Trust the magic of new beginnings! Be happy, be kind, be grateful! Happy New Year 2022! Stay safe everyone. Love you all ❤️🤗 pic.twitter.com/imt6vXH0yW
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2021
కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోనుషేర్ చేసి , అందరూ దయతో, కృతజ్ఞతతో సంతోషంగా ఉండాలని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే 1 లక్షకు పైగా లైక్‌లను సాధించింది. సోషల్ మీడియాలో ఈ అరుదైన ఘనతను సాధించిన ఏకైక భారతీయ నటుడుగా మహేష్ బాబు నిలిచారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: