ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈసినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్బంగా రిలీజ్ కానుంది. ఇకవింటేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి చలో చలో సంచారి అనే పాట టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ఈపాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించాడు. ఈపాటలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈపాట కూడా మంచి రెస్పాన్స్ తో వ్యూస్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
UddJaaParindey – https://t.co/c8cvJM7FAi
Sanchari – https://t.co/DyAcsVU6bH
Raegaigal – https://t.co/83JnvLr69Q
Sanchari – https://t.co/Qd2Q9oSJrU
SwapnaDoorame – https://t.co/cOE7tsBmCP pic.twitter.com/V99LL5TXOe— UV Creations (@UV_Creations) December 16, 2021
కాగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 1970ల నాటి యూరప్ నేపథ్య కథతో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో ప్రభాస్ విక్రమాధిత్య అనే పామిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా.. తను ప్రేరణ అనే పాత్రలో కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: