మజిలీ, లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమా అలానే థాంక్యూ సినిమా కూడా చేస్తున్నాడు. వీటిలో బంగార్రాజు సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. థాంక్యూ సినిమా మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. దీనితో పాటు రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమాను థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#ThankYouTheMovie will release only in theaters. pic.twitter.com/M3i7N9qw7J
— Sri Venkateswara Creations (@SVC_official) December 8, 2021
కాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. . టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ‘మనం’ వంటి క్లాసిక్ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మరోసారి నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మరో హిట్ కొడతారేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: