మొత్తానికి టాలీవుడ్ చాలా రోజుల తర్వాత కాస్త కళకళలాడిపోతుంది. కరోనా వల్ల చిత్రపరిశ్రమ ఎన్ని సమస్యలు ఎదుర్కొందో చూశాం. ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి కానీ ఇప్పుడు కాస్త పరిస్థితులు మెరుగుపడటంతో మళ్లీ మునుపటి కళ కనిపిస్తుంది. కొత్త సినిమాల రిలీజ్ లు, అప్ డేట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా పలు కార్యక్రమాలతో సందడి నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతికి, ఆ తరువాత సమ్మర్.. ఆ తరువాత దసరా, దీపావళి కి సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం డిసెంబర్ లో కూడా వరుసగా సినిమాల రిలీజ్ తో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. ఇక దీనిలో భాగంగానే ప్రతిరోజూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. ఈనేపథ్యంలో నేడు మరిన్ని అప్ డేట్స్ తో టాలీవుడ్ బిజీ అయిపోయింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు పెద్ద సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చాయి. అందులో ఆర్ఆర్ఆర్ ఒకటి, మరొకటి రాధేశ్యామ్, ఇంకొకటి పుష్ప, స్టార్ హీరోయిన్ సమంత సినిమా అప్ డేట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించి రెండు పవర్ ఫుల్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఈసినిమా జనవరి 7న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ పోస్టర్లను రిలీజ్ చేశారు. మరో బిగ్ అప్ డేట్ అంటే పుష్ప ట్రైలర్. ఈ ట్రైలర్ కోసం ఎంతోమంది ఆసక్తికంగా ఎదురుచూశారు. పుష్ప మొదటి పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ కానుండగా నేడు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక రాధేశ్యామ్ నుండి నేడు సోచ్ లియా అనే హిందీ సాంగ్ టీజర్ రిలీజ్ అయింది. ఈసినిమా జనవరి 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇక మరో బిగ్ అనౌన్స్ మెంట్ సమంత సినిమాకు సంబంధించింది. సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ నేడు సెట్స్ పైకి వెళ్లింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: