గత కొద్దికాలంగా కరోనా వల్ల థియేటర్ల కంటే ఓటీటీలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలు అయితే మ్యాగ్జిమమ్ ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఇక సురేష్ బాబు తన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ రెండు సినిమాలు నారప్ప,అలానే దృశ్యం 2 ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఇంకా రానా ప్రధాన పాత్రలో వస్తున్న విరాట పర్వం కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా సురేష్ బాబు ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తుండటంపై పలు విమర్శలు వచ్చాయి. కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా సురేష్ బాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు ‘విరాటపర్వం’ సినిమా గురించి అలానే ఓటీటీ రిలీజ్ లు చేస్తున్నందుకు తనపై వస్తున్న కామెంట్ల గురించి స్పందించి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. విరాట పర్వంకు సంబంధించి ఇంకా 5రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందని.. అది అయిపోయిన తరువాత రిలీజ్ ఎప్పుడు ఎక్కడ అనేది చెబుతామని క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నందుకు తనపై వస్తున్న కామెంట్లపై స్పందించి నేను అవి కేర్ చేయను.. ఎవరో కామెంట్ల కోసం నేను నష్టపోవాలని అనుకోవడంలేదు అని స్పష్టం చేశారు.
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా విరాట పర్వం. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: