అగ్రహీరో బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘అఖండ’ మూవీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను కూడా సైట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 13న ఉదయం 10 గంటల 26 నిమిషాలకు ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
The Hunt Begins Very Soon 🤘#NBK107 Muhurtham on 13th Nov at 10:26 AM 🔥
#NandamuriBalakrishna @shrutihaasan @megopichand @MusicThaman ♥️ pic.twitter.com/mdgdV04I4a— Mythri Movie Makers (@MythriOfficial) November 10, 2021
కాగా ఈసినిమాలో శృతి హాసన్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్. క్రాక్ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించాడు గోపిచంద్. ఇక ఈసినిమాను కూడా రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈసినిమాకోసం రీసెర్చ్ కూడా బాగానే చేశాడు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: