బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమాలో ఎప్పటినుండో శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే శ్రుతిహాసన్ ను ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుంది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని కథను పూర్తి చేసే పనిలో ఉండగా త్వరలోనే ఈసినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు
క్రాక్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చింది శృతి హాసన్. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో శృతి నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: