మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ , ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్ రష్మిక ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో “పుష్ప “మూవీ పై స్పందించారు. రష్మిక మాట్లాడుతూ .. “పుష్ప “మూవీ లో తన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందనీ , హీరో అల్లు అర్జున్ తో తన కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందనీ , హీరో అల్లు అర్జున్ చాలా ఫ్రెండ్లీ పర్సన్ అనీ , మారేడుమిల్లి వంటి రియల్ , కఠినమైన లొకేషన్స్ లో ప్రతీ ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారనీ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందనీ చెప్పారు. సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ “పుష్ప ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: