సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కు పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా నుండి ఇటీవలే పలు లీకులు బయటకు రాగా మరింత జాగ్రత్రగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఫహాద్. ఇక తాాజాగా ఫహాద్ కూడా పుష్ప సెట్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఫహాద్ కు సంబంధించి కీలకమైన సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Welcome on sets & wish you a very Happy & Prosperous Onam #FahadhFaasil Garu ❤️
– Team #Pushpa #PushpaTheRise#ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/lYXEhFx2l0
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2021
కాగా సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అయింది. ‘దాక్కో దాక్కో మేక’ అంటూ సాగే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సుకుమార్ – బన్నీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాబట్టి భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: