మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసే కొరటాల ఈ సినిమా కోసం కూడా అలాంటి కథనే సిద్ధం చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం కోకాపేట లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. ఈషూట్ లో చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసందర్భంగా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు చరణ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పదిహేను రోజుల పాటు కంటిన్యుయస్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తి కానుంది. రామ్ చరణ్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Doors to Dharmasthali have reopened & we are in the final schedule🔥
Exciting updates soon!#Acharya
Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @adityamusic pic.twitter.com/Dc71rK2SRj
— Konidela Pro Company (@KonidelaPro) July 10, 2021
కాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: