బిగ్ బాస్’ షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ గేమ్ షో ద్వారా మరోసారి అలరించడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు జెమినీ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్న తారక్.. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు. మరికొన్ని రోజుల్లో షో ప్రసారం అవుతుందని అనుకోగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో ఈ షో జరగకపోవచ్చన్న రూమర్స్ కూడా వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజంలేదని తేలిపోయింది. జులై నుండి ఈ షో షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈరోజు నుండి ఈ షో షూటింగ్ స్టార్ట్ అయింది. వారం రోజుల పాటు ఈ షోకు సంబంధించిన షూటింగులో పాల్గొననున్నాడట తారక్. ఆ తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
కాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమై జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. అయితే ఈ గ్యాప్‌లోనే తారక్ ఈ షో కోసం డేట్స్ కేటాయించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: