సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య లక్ష్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్నఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య. ఇక ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా నేటి నుండి ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్షకుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మేకింగ్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: