ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రభాస్ ఏ సినిమా చేస్తే ఆ సినిమా టీమ్ కు స్పెషల్ గా వంటలు చేయించుకొని మరీ తీసుకెళుతుంటాడు . ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కూడా చాాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా మరో సీనియర్ హీరోయిన్ తాజాగా స్పెషల్ థ్యాంక్స్ చెబుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు భాగ్యశ్రీ. రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో భాగ్యశ్రీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కొద్దిరోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ లో ఉండగా రీసెంట్ గానే మళ్లీ మొదలుపెట్టారు. ఆమధ్య ఈసినిమా షూటింగ్ అప్పుడే ప్రభాస్ ఆతిథ్యం పై పలు ప్రశంసలు కరిపించారు భాగ్యశ్రీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరోసారి భాగ్య శ్రీకి ఓ సర్‌ప్రైజ్ పంపించారు ప్రభాస్. ఈసందర్భంగా భాగ్యశ్రీ.. రుచికరమైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్ ప్రభాస్. యూ స్పాయిల్ మి” అని కామెంట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Another stack of the tasty hyderabadi sweets #pootharekulu
Thank you #Prabhas … you spoil me. pic.twitter.com/em1A6RbGpE— bhagyashree (@bhagyashree123) July 1, 2021
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: