శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వస్తున్న సినిమా అన్నాత్తే. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే షూట్ కు పలు సార్లు బ్రేక్ పడగా.. మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈసినిమాను దీపావళి కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే కరోనా వల్ల అది సాధ్యపడుతుందో లేదో అని అనుకున్నారు. దీంతో ఆమధ్య దీపావళికి సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం ఖచ్చితంగా దీపావళికే రిలీజ్ చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి దీపావళికే కన్ఫామ్ చేస్తూ ప్రకటించారు. నేడు ఈ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా రజినీ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ దీపావళికి థియేటర్ లోకి వస్తుందని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#AnnaattheDeepavali ku ready ah?!@rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer #Annaatthe pic.twitter.com/RVVIqO0xJS
— Sun Pictures (@sunpictures) July 1, 2021
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: