మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్యాచ్ వర్క్ మినహా “ఆచార్య “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.”ఆచార్య “మూవీ తరువాత చిరంజీవి బ్లాక్ బస్టర్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ మూవీ ని తెరకెక్కించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేస్తూ, మలయాళమూవీ లో లేని హీరోయిన్ పాత్రను ఈ రీమేక్ మూవీ లో క్రియేట్ చేస్తున్నారు. అనుష్క లేదా నయనతార కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టినట్లు సంగీత దర్శకుడు తమన్ సోమవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: