శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వస్తున్న సినిమా అన్నాత్తే. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. ఇక ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టగా మళ్లీ సెకండ్ వేవ్ వచ్చింది. అన్నాత్తే టీమ్ మెంబర్స్ కరోనా బారిన పడటం.. మధ్యలో రజినీ కూడా అనారోగ్యం పాలవ్వడం వల్ల మధ్యలో కొన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడింది. ఆతర్వాత మళ్లీ హైద్రాాబాద్ వచ్చి లాక్ డౌన్ పెట్టినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని హైద్రాబాద్ లో షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఇదిలా ఉండగాఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తున్నాయి. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్టే. రజినీ దాదాపు తన పోర్షన్స్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఒక్క చిన్న షెడ్యూల్ మాత్రమే మిగిలిఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా రిలీజ్ ను కూడా అనుకున్న డేట్ కే రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ముందు నుండి దీపావళి కి అనుకున్నా మధ్యలో షూట్ కుబ్రేక్ రావడం.. రజినీ ఆరోగ్యం కూడా బాలేకపోవడంతో రిలీజ్ డేట్ మారుతుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాదాపు దీపావళికే సినిమా వస్తుందంటున్నారు. మరి నవంబర్ అంటే ఇంకా నాలుగు నెలలు వరకూ టైం ఉంది..ఈలోపు థియేటర్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.. ఈలోపు మిగిలిన షూట్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈజీగా కంప్లీట్ చేసేయోచ్చు..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: