ఇప్పటికేధనుష్ నటించిన కర్ణన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి విదితమే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ‘జగమే తంతిరమ్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో జగమే తంత్రం పేరుతో ఈసినిమా వస్తుంది. ఇక కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఫైనల్ గా
ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘నెట్ ఫ్లిక్స్’ లో జూన్ 18న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ఓటిటిలో భారీ రేంజ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ లో దాదాపు 190 దేశాల్లో, 17 భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుండడం విశేషం.ఇక ఇటీవల ధనుష్ నటించిన “కర్ణన్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా విడుదల కానున్న “జగమే తంతిరమ్” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా… యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: