కరోనా పరిస్థితుల కారణంగా చాలా సినిమాల థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. సినిమాల షూటింగ్ లు రద్దయ్యాయి. ఇక ఇప్పుడిప్పుడే హీరోలు షూటింగ్ లకు ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తుండగా.. యంగ్ హీరో నితిన్ అప్పుడే డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ తెలుగు రీమేక్ గా మాస్ట్రో రూపొందుతుంది. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల మిగతా ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైనట్టు మేకర్స్ ప్రకటించారు. కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షెడ్యూల్ పూర్తి చేయానున్నారు చిత్రయూనిట్.
Youth🌟 @actor_nithiin ‘s next crazy project #Maestro👨🏻🦯commenced its final shoot schedule Today in Hyderabad!🎹
@MerlapakaG @SreshthMovies @tamannaahspeaks @NabhaNatesh #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella @mahathi_sagar pic.twitter.com/MNDvAAV4c2— Sreshth Movies (@SreshthMovies) June 14, 2021
కాగా ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: