కరోనా సెకండ్ వేవ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటూ వైద్యులు సూచించిన సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కు కరోనా సోకడంతో పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తారక్ కోలుకోవాలని కోరుకుంటూ తనతో మాట్లాడినట్టు తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవిషయాన్ని చిరు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తను తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉన్నారు…తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది..త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy.త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను.
God bless @tarak9999— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2021
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాలో కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈసినిమా తరువాత తన 30 వ సినిమా కొరటాల శివతో చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారెజ్ సినిమా తరువాత వస్తున్న సినిమా ఇది. ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: