కరోనా సెకండ్ వేవ్ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా తన ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్నా పెద్దా.. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఇప్పటికే కరోనా వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు. ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కూడా ఈమధ్యకాలంలో కరోనా వల్ల మృతి చెందారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి ) మృతి చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్ పై వైద్యం అందించినా.. ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో పరిస్థితి చేయి దాటడంతో ఈరోజు మృతి చెందారు. ఇక ఆయన మృతి పట్ల.. అటు పలువురు జర్నలిస్ట్ లతో పాటు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీఎన్ఆర్ యూట్యూబ్ లో ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్’ కార్యక్రమంతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఎంతో మంది సినీ ప్రముఖులను ఈకార్యక్రమం ద్వారా టీఎన్ఆర్ ఇంటర్వ్యూ చేశారు. అంతేకాదు పలు సినిమాల్లో కూడా ఆయన నటించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జార్జిరెడ్డి’, ‘సుబ్రహ్మణ్య పురం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’తదితర చిత్రాల్లో నటించారు.
.@telugufilmnagar pays tributes to the renowned journalist and actor #TNR garu who has passed away today due to COVID19. May his soul rest in peace 🙏#RIPTNR #TeluguFilmNagar pic.twitter.com/cjHV1vzZVV
— Telugu FilmNagar (@telugufilmnagar) May 10, 2021
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: