రామ్ నారాయణ్ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. నూతన నటీ నటులతో.. ప్రతి ఒక్కరికీ ఒక బయోపిక్కు ఉంటుందన్న కథాంశంతో.. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది.మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఐ, రామ కృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమా రిలీజ్ లు వాయిదా పడగా గత ఏడాది లాగే చిన్న సినిమాలు ఓటీటీ దారి పట్టాయి ఇక ఈసినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కు సిద్దంగా ఉంది. మే 14న జీ 5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కాబోతోంది. తమ సినిమాను జీ5లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు తెలియచేస్తున్నారు.
కాగా 2020లో కరోనా కారణంగా అనేక సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది మొదట్లో కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు కుదుటపడడంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని మళ్లీ గడ్డుపరిస్థితులు వచ్చాయి. కరోనా కారణంగా థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీ ప్రత్యామ్నయం గా కనిపించింది. దీంతో సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ కావడం మొదలు పెట్టాయి. ఇంకా మరెన్ని సినిమాలు ఓటీటీలోకి వస్తాయో చూడాలి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























