కరోనా సెకండ్ వేవ్ మళ్లీ సినిమా పరిశ్రమపై.. అలానే సెలబ్రిటీలపై బాగా పడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈరోజు జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతి చెందిన చేదు వార్త వినగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం. ఇటీవల నన్ను కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సింది కోరుతున్నా అంటూ ట్విటర్‌లో ఎన్టీఆర్ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
— Jr NTR (@tarak9999) May 10, 2021
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్’లో కొమరం భీమ్‌గా నటిస్తున్నాడు ఎన్టీఆర్. రామ్‌చరణ్ కూడా ఈసినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి సినిమాలు అయిపోయిన తరువాత జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: