ఓటీటీ సందడి మళ్లీ మొదలైంది

OTT Platforms Once Again Comes Into Play With Corona Virus Surge Across India,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sulthan,Sulthan Movie,Sulthan Telugu Movie,Anasuya Thank You Brother,Thank You Brother,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Radhe,Radhe Movie,Karnan,Karnan Movie,OTT,OTT Movies,OTT Platforms,Upcoming Telugu Movies in OTT Platform May 2021,Telugu OTT Movies Releasing This Week,Upcoming Telugu Movies in OTT Platform,OTT Platform May 2021,OTT Platform May 2021 Movies,Upcoming Telugu Movies in OTT,Telugu OTT Movies 2021 This Week,Upcoming Telugu Movies in OTT,Upcoming Tollywood Movies in OTT,Upcoming Telugu Movies in OTT Platform 2021,Upcoming Telugu Movies on OTT 2021,Telugu Movies Online Digital Release

గత ఏడాది కరోనా వల్ల ఓటీటీ వేదికలు మాత్రం పండగ చేసుకున్నాయి. ఎందుకంటే అంతకుముందు సినిమాలు థియేటర్లలోకి వచ్చిన తరువాత.. చాలా రోజులకు ఓటీటీలో రిలీజ్ అయ్యేవి. కానీ 2020 ఈ రూల్స్ ను బ్రేక్ చేసేసింది. కరోనాకు థియేటర్లు మొత్తం కొన్ని నెలలపాటు బంద్ అయ్యాయి. దీంతో ఓ మోస్తరు సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఇక జనాలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఓటీటీ వేదికలు దీన్ని బాగా క్యాష్ చేసుకున్నాయి. ఆ త‌ర‌వాత లాక్ డౌన్ ఎత్తేయ‌డం, థియేట‌ర్లు తెర‌చుకోవ‌డంతో – ఓటీటీ ప్రాధాన్యం త‌గ్గింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మ‌ళ్లీ లాక్ డౌన్ లాంటి ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. థియేట‌ర్లు బంద్ అయ్యాయి. ఇప్ప‌ట్లో సినిమాల్ని విడుద‌ల చేసే ధైర్యం ఎవ్వ‌రికీ లేదు. చాలా సినిమాలు ఇప్పటికే తమ రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకున్నాయి. దీంతో మార్చిలో గ్యాప్ లేకుండా వరుస సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించగా.. ఏప్రిల్ లో మాత్రం సినిమాలు లేక థియేటర్లు వెలవెలపోతున్నాయి. ఇక మళ్లీ ఈ ప‌రిస్థితిని క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి ఓటీటీ సంస్థ‌లు. ఇప్ప‌టికే చిత్రీకర‌ణ పూర్త‌యి, విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాలతోపాటు.. రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే చావు కబుర చల్లగా, జాతిరత్నాలు లాంటి సినిమాలు వచ్చేశాయి. వైల్డ్ డాగ్.. శ్రీకారం సినిమాలు అయితే సిల్వర్ స్క్రీన్ పై అంతగా ఆకట్టుకోలేదు కానీ.. ఓటీటీ లో వ్యూస్ మాత్రం షాకిస్తున్నాయి. సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. వకీల్ సాబ్ ఈరోజు ప్రైమ్ లో రానుంది. ఇంకా కార్తీ సుల్తాన్ కూడా నేడు ఆహాలో రానుంది. అనసూయ-అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో వచ్చిన థ్యాంక్ యు బ్రదర్ నేరుగా ఓటీటీ లో రిలీజ్ కానుంది. ఆహా లో ఈసినిమా మే 7న స్ట్రీమింగ్ అవ్వనుంది. సల్మాన్ నంటించిన రాధే కూడా నేరుగా మే13న జీ ప్లెక్స్ లో రిలీజ్ కానుంది. ధనుష్ నటించిన కర్ణన్ సినిమా ఇప్పటికే రిలీజ్ అయి మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమా కూడా ఓటీటీలో కి వచ్చేస్తుంది. ప్రైమ్ లో మే 9న రిలీజ్ అవుతుంది. ఇవే కాదు.. ఇంకా చాలా సినిమాలు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నాయి.

మరి కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇప్పుడప్పుడే థియేటర్లు కూడా తెరుచుకునే పరిస్థితి లేదు.. దీంతో మరికొంతకాలం ఓటీటీ వేదికలకు మంచి ఛాన్స్ దొరికినట్టే..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =