బ్లాక్ బస్టర్ “ఓం శాంతి ఓం ” మూవీ తో కథానాయికగా బాలీవుడ్ కు పరిచయం అయిన దీపికా పడుకోణె పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. దీపికా ప్రస్తుతం “83 “, “పఠాన్ “, “ఫైటర్ ” మూవీస్ లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ తో ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో కథానాయికగా దీపికా పడుకోణె ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శకున్‌బాత్రా దర్శకత్వంలో దీపికా పడుకోణె ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ లో దీపిక ఫిట్‌నెస్ ట్రెయినర్ పాత్రలో నటిస్తున్నారు. స్వతహాగా యోగా, ఏరోబిక్స్ వంటి వాటిల్లో నిష్ణాతురాలైన దీపికా పడుకోణె సినిమాలోని పాత్రకు పర్ ఫెక్ట్ గా కుదిరిందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చే దీపిక కు ఈ క్యారెక్టర్ సూటవుతుంది. ఈ మూవీ లో మరో హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: