ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవెబ్ సిరీస్ చూస్తేనే సిరీస్ దర్శకులు రాజ్-డీకే రాజ్ (నిడిమోరు, కృష్ణ డీకే) ల పనితనం గురించి చెప్పనవసరంలేదు. ఇక ఇప్పుడు వీరిద్దరి నుండి వస్తున్న సినిమానే సినిమా బండి. ప్రవీణ్ కంద్రెగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో స్టార్లు లేరు. వాళ్లు స్టార్లు లేకుండా సినిమా తీశారంటే, కథని ఎంతగా నమ్మారో అర్థం అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఇక ఈట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ లో ఓ ఆటోడ్రైవర్‌కి ఓ కెమెరా దొరుకుతుంది. దాంతో సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వస్తుంది. ఆ ఊర్లో.. బార్బర్ ని హీరో చేసేస్తాడు. హీరోయిన్ కోసం కూరగాయలు అమ్మే అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. ఆ ఊర్లో ప్రతీదాన్నీ ఓకథగా చెప్పే ముసలోడ్ని కథా రచయితని చేసేస్తారు. ఇక అలా మొదలు పెట్టి వాళ్లందరూ కలిసి సినిమా ఎలా తీశారన్నది ఈసినిమా. ఓ ఊర్లో కొంతమంది వ్యక్తులు కలిసి, ఓ సినిమా తీయాలనుకుంటే… అసలు వాళ్లకు సినిమా జ్ఞానమే లేదనుకుంటే, ఎలా ఉంటుందన్నది `సినిమా బండి` కాన్సెప్టు. ట్రైలర్ నవ్వులు పూయిస్తుంది. కచ్చితంగా కొత్త తరహా అనుభవం ఇస్తుందన్న నమ్మకం కల్పిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
Presenting the trailer of CINEMA BANDI — an independent film made under #D2Rindie. A sweet little film — about making a film — with loads of humour and a huge heart!https://t.co/NWPL1Az7Fv
On Netflix, May 14.#CinemaBandi #CinemaBandiOnNetflix
Please stay safe. Wear a mask. pic.twitter.com/ruIENjM9JE
— Raj & DK (@rajndk) April 30, 2021
కాగా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఫిల్మ్ మేకర్స్‌ను ప్రొత్సహించడంలో భాగంగా `డీ2ఆర్ ఇండీ` అనే ఓ కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేసి ప్రతిభావంతులైన కొత్తవారిని ప్రొత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగులో తొలి అడుగుగా ఇండిపెండెంట్ కామెడీ ఫిల్మ్ ‘సినిమా బండి’ ను నిర్మించారు. మే 14న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: