రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో ‘థ్యాంక్ యు బ్రదర్’ టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అన్నిపనులు పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 30న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే కొద్దిరోజులుగా ఈసినిమాను ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మేకర్స్ ఆహాలో సినిమా ను నేరుగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
Get ready for a thrilling drama, with an unmissable twist! #ThankyouBrother World Premiere on May 7, only on @ahavideoIN.@anusuyakhasba @viraj_ashwin @monie_kaa @anishkuruvilla @Raparthy @sureshragutu1 @gunasekaran_gm @MaguntaSarath @JustOrdinaryEnt @adityamusic pic.twitter.com/DB8be9q3ff
— Vamsi Kaka (@vamsikaka) April 26, 2021
కాగా జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, బాబీ రాఘవేంద్ర, సమీర్ నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: