గత ఏడాది నుండి కొన్ని సినిమాల షూటింగ్ లకు మాత్రం అస్సలు టైమ్ కలిసిరావట్లేదు. కరోనా పోయింది ఇక షూటింగ్ లు మొదలు పెట్టొచ్చు అనుకున్నారు కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ తో మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటికే ఎన్నో సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడగా.. ఇప్పుడు రజినీ అన్నాత్తే సినిమాకు కూడా బ్రేక్ పడింది. ఇటీవల రజనీ పూర్తిగా కోలుకోవడంతో తిరిగి షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో రజనీకాంత్ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయిందని, విడుదల తేది కూడా మారబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ అవి ఒట్టి పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా కర్ప్యూ సమయంలో కూడా షూటింగ్ జరుపుకునేలా తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసుల నుంచి చిత్ర యూనిట్ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నామని.. మరో 15 రోజుల పాటు హైదరాబాద్‌లోషూటింగ్ చేసుకొని చెన్నై వెళ్తామని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు. అది ఎప్పుడో అయిపోయింది. సినిమా షూటింగే పూర్తి కాలేదు. మరి చూద్దాం అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తారో లేదో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: