తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈసినిమా తీయడం అంత ఈజీ కాదని ఇప్పటికే చెప్పాడు. ఇలాంటి సినిమాను తీయాలంటే ఎన్నో కాంప్లికేషన్స్ ను తట్టుకోవాల్సి వస్తుంది. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే అలాంటిది ఏం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓంరౌత్.. సినిమాపరంగా ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఎంతో రీసెర్చి చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఓం రౌత్ చెబుతున్నారు. 30 రోజులకు పైగా జరిగిన షూటింగ్‌తో దాదాపు 30 శాతం చిత్రాన్ని పూర్తి చేశామనీ.. వచ్చే ఏడాది ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నట్లు ఓం రౌత్ తెలిపారు. ప్రభాస్, సైఫ్ ఆలీఖాన్ మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయనీ, వారిద్దరిపై భారీ యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నామనీ ఆయన చెప్పారు. కృతి సనన్ తెలుగు నేర్చుకుంటోందనీ, తన పాత్ర కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతోందనీ ఓం రౌత్ తెలిపారు. తరచూ కరోనా పరీక్షలు చేయించుకుంటూ షూటింగ్ చేస్తున్నామనీ, తక్కువ మంది యూనిట్ సభ్యులతోనే వర్క్ చేస్తున్నామనీ ఆయన చెప్పారు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మరో బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: