తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలు సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. కోలీవుడ్ లో బిజీగా ఉన్న రాశీఖన్నా 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రాశీఖన్నా నటించిన “భ్రమమ్ “మలయాళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నాగచైతన్య “థ్యాంక్ యు “, గోపీచంద్ “పక్కా కమర్షియల్ ” మూవీస్ లో రాశీఖన్నా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో గోపీచంద్ కు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. “పక్కా కమర్షియల్” మూవీ లో తన క్యారెక్టర్ గురించి రాశీఖన్నా మాట్లాడుతూ .. తన పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉంటుందనీ , తన కెరీర్ లో అత్యంత హాస్యభరిత క్యారెక్టర్ అనీ , కామెడీ నే తన బలం గా భావిస్తాననీ , భవిష్యత్ లో మరిన్ని కామెడీ రోల్స్ లో నటించడానికి “పక్కా కమర్షియల్” మూవీ ప్రేరణ నిచ్చిందనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: