ఇంకా ఒక్క రోజు వైయిట్ చేస్తే చాలు పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ సినిమా ధియేటర్లలోకి వచ్చేస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాకు చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా థమన్ సంగీతం అందించాడు.. మరి రేపు రిలీజ్ అవుతున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్
ఈసినిమాను చూడటానికి ఉన్న మొట్ట మొదటి రీజన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత వస్తున్న సినిమా కావడం.. పవన్ కు ఉన్న డిఫరెంట్ క్రేజే ప్రేక్షకులను ధియేటర్స్ కు వచ్చేలా చేస్తుంది. అందులో నో డౌట్. ఇప్పటికే మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు వకీల్ సాబ్ కు నాలుగు స్టార్లు కూడా ఇచ్చేశాడు. దీనితో పవన్ పవర్ ప్యాక్ట్ కు పెర్ఫామెన్స్ ను చూడటానికైనా అందరూ వచ్చేస్తారు.
కథ
ఈసినిమా పింక్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీనితో ఈసినిమాను ఇప్పుడు వేణు శ్రీరామ్ పవన్ హీరోగా రీమేక్ చేశాడు. అయితే ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు.. పవన్ నుండి ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అలాంటివి కొన్ని జోడించి కథలో చిన్న చిన్న మార్పులు చేశారు. పాటలు, యాక్షన్ సీన్స్ లాంటివి యాడ్ చేశారు.
థమన్
ప్రస్తుతం థమన్ కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుసు. ఎవరు చూసినా థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే థమన్ పవన్ కు వీరాభిమాని. ఎప్పటినుండో పవన్ సినిమాకు సంగీతం అందించాలనుకుంటుండగా… ఇప్పుడు ఈసినిమాతో ఆ కోరిక తీరింది. ఇక అదే ఇంట్రెస్ట్ తో పాటలను కంపోజ్ చేశాడు.. దానికి నిదర్శనమే పాటలకు వస్తున్న రెస్పాన్స్.
నిర్మాతలు
హిందీలో పింక్ సినిమా సూపర్ హిట్ అవ్వగా ఇక ఈసినిమాను తమిళంలో నేర్కొండ పర్వాయి అనే టైటిల్ తో అజిత్ ప్రధాన పాత్రలో బోనీ కపూర్ నిర్మించాడు. తమిళ్ లో కూడా సక్సెస్ అవ్వడంతో తెలుగులో దిల్ రాజు తో కలిసి బోనీ కపూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజు సినిమాలంటే ఎలా ఉంటాయో తెలుసు. మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇక దిల్ రాజుకు కూడా పవన్ తో చేయాలని ఎన్నో ఏళ్ల నుండి ఉన్నకోరిక ఈసినిమాతో తీరబోతుంది.
కాస్టింగ్
ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య లాంటి నటులు ఈసినిమాలో నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్. ఆయన నటన గురించి కొత్తగా చెప్పుకునేది లేదు. ట్రైలర్ ను బట్టి చూస్తే పవన్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య ఉండే కోర్టు సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయనిపిస్తుంది. మరోవైపు నివేదా థామస్, అంజలి, అనన్య వీరు ముగ్గురు కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతారనిపిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: