శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ , ప్రేక్షకులను అలరిస్తున్న దిల్ రాజు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాతగా రాణిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో , రికార్డ్ స్థాయి లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత దిల్ రాజు పాత్రికేయులతో సమావేశమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “తొలిప్రేమ “మూవీ కి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాననీ , పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ , యువతలో ఉన్న ఫాలోయింగ్ చూసి నిర్మాత గా మారితే పవన్ కళ్యాణ్ తో మూవీ నిర్మించాలనుకున్నా ననీ , 22 సంవత్సరాల కల “వకీల్ సాబ్ “మూవీ తో నెరవేరిందనీ , సినిమాల పట్ల తనకున్న తపన , అభిరుచి పవన్ కళ్యాణ్ గ్రహించి భవిష్యత్ లో మరిన్ని సినిమాలలో నటిస్తానని అన్నారనీ , “వకీల్ సాబ్ “మూవీ చూసి ప్రేక్షకులు బాగుందని చెప్పే మాటలలో ఆనందాన్ని ఆస్వాదించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాననీ , పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో నటించిన చిత్రమనీ , పవన్ కళ్యాణ్ అభిమానులను అలరించేలా దర్శకుడు వేణు శ్రీరామ్ “వకీల్ సాబ్ “మూవీ ని తెరకెక్కించారనీ , తమ బ్యానర్ లో “F3 “, “థ్యాంక్ యు “,”రౌడీ బాయ్స్ “, “పాగల్ “మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయనీ , దర్శకుడు శంకర్ , రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ జూలై , ఆగస్ట్ లలో ప్రారంభం కానుందని చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: