అమర్ రాజా మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ మనవడు , మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో ఇస్మార్ట్ గర్ల్ నిధి అగర్వాల్ కథానాయిక. జగపతి బాబు , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ లోని రీమిక్స్ సాంగ్ “జుంబారే ” ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ సాంగ్ లో అశోక్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో అశోక్ గల్లా బర్త్ డే సందర్భంగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మోషన్ పోస్టర్ లో అశోక్ కౌ బాయ్ గెటప్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉగాది పండగ కు ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు .
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: