పవన్ కళ్యాణ్ గారి కాంప్లిమెంట్ మర్చిపోలేను – అంజలి

I Can’t Forget The Compliment Given By Power Star Pawan Kalyan Says Anjali,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kaylan,Power Star Pawan Kaylan,Hero Pawan Kaylan,Actor Pawan Kaylan,I Can’t Forget The Compliment Given By Pawan Kalyan Says Anjali,Anjali,Actress Anjali,Heroine Anjali,Actress Anjali Exclusive Interview,Anjali Latest News And Updates,Actress Anjali About Pawan Kalyan,Anjali About Pawan Kalyan,Anjali Spoke About Pawan Kalyan,Anjali on Vakeel Saab,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Movie Update,Anjali About Vakeel Saab,Anjali Vakeel Saab Interview,Anjali Interview,Anjali Latest Interview,Actress Anjali New movie,Anjali Movies

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను వకీల్ సాబ్ గా తెలుగులో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవర్ స్టార్ క్రేజ్ ను బట్టి.. స్టామినా ను బట్టి మన తెలుగు ప్రేక్షకులు పవన్ నుండి ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ యాడ్ చేశారు. మరోవైపు ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూసేద్దామా అని ఈగర్ గా వైయిట్ చేస్తున్నారు. ఇక రిలీజ్ ఇంకా ఒక్క వారం మాత్రమే ఉండటంతో వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించడానికే చూస్తున్నారు చిత్రయూనిట్. ఇదిలా ఉండగా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో అంజలి నటించిన సంగతి తెలసిందే. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి “వకీల్ సాబ్” గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* “దర్శకుడు శ్రీరామ్ వేణు గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం. కానీ తెలుగు నేటివిటీకి తగినట్లు కొత్తగా ఉంటుంది అని చెప్పారు. సినిమా గురించి ఆయన చెప్పిన కాన్సెప్ట్ లు బాగా నచ్చాయి. మేము ఈ సినిమాలో చేసిన మార్పులు వకీల్ సాబ్ ట్రైలర్ చూశాక మీకు అర్థమయ్యి ఉంటుంది. హిందీ పింక్ తో వకీల్ సాబ్ ను కంపేర్ చేసి చెప్పలేను.

* పవన్ కళ్యాణ్ గారితో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నేను జనరల్ గా ఎక్కువగా మాట్లాడుతాను. అలాంటి టైమ్ లో నా వల్ల మిగతా వారు ఏదైనా డిస్టబ్ అవుతారా అని భయపడ్డాను. పవన్ గారు చాలా ఇన్ పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది. నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. మా మధ్య రిలేషన్ లేకుంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్ లో బాండింగ్ ఏర్పడింది. అందువల్ల నటించేప్పుడు చాలా ఈజీ అయ్యింది.

* నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎలాంటి వివరాలు చెప్పలేను. పవన్ గారు సెట్స్ లో చాలా కామ్ గా ఉంటారు. అందరితోనూ మాట్లాడుతారు. డిగ్నిఫైడ్ గా ఉంటారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటేనే నాకు పదిహేను రోజులు పట్టింది. పవన్ గారితో సినిమా అనగానే జంప్ చేశాను. అయితే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. పవన్ గారితో సినిమా చేస్తున్నాను అనేదే నా మనసులో ఉండేది. పెద్ద హీరోతో పనిచేస్తున్నప్పుడు మన క్యారెక్టర్స్ కొట్టుకుపోతాయి. కానీ వకీల్ సాబ్ లో నా క్యారెక్టర్ కు ఒక స్థానం ఉంటుంది.

* వకీల్ సాబ్ ను పింక్ తో పోల్చితే, పింక్ కథలోని సోల్ ఇందులో అలాగే ఉంటుంది. మార్పులన్నీ ఆ మెయిన్ స్టోరీ చుట్టూ చేశారు. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకృత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు కామన్ అయి పోయాయి. మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చూపిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఏ అమ్మాయికీ రాకూడదు.

* సినిమా ఇండస్ట్రీలో నాయికలకు కొన్ని చేదు సందర్భాలు ఎదురవుతుంటాయి అంటారు. అయితే ఇక్కడ సెలబ్రిటీ, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అని కాదు అమ్మాయి అమ్మాయే. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్ చాలు నా క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుంది అని చెప్పేందుకు. ఈ సీన్ మరో రోజు చేయాల్సింది. కానీ ఆ రోజు సడెన్ గా షూట్ చేశాం. ఈ కోర్ట్ సీన్ చేశాక, నేను వణికిపోయాను. అంత ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నటిగా నేనూ ఉద్వేగపడతాను. అలా అయితేనే సీన్ కరెక్ట్ గా వస్తుంది.

* వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ గారితో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. రెండు సీన్స్ లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి నటించాను. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్ బాగా నటిస్తేనే, మనకూ ఆ టైమింగ్ వస్తుంది. వాళ్లు ఫర్మార్మ్ చేయకుంటే మనమూ డల్ అ‌వుతాం. ప్రకాష్ రాజ్ గారితో పనిచేసినప్పుడు మనకూ ఆ ఎనర్జీ వస్తుంది.

* మీకు ఇష్టమైతే ఎస్ లేకుంటే నో చెప్పడం మీ ఛాయిస్. నో చెప్పకూడదు అని ప్రశ్నించే రైట్ ఎవరికీ లేదు. ఇష్టపడటం ఇష్ట పడకపోవడం అమ్మాయి నిర్ణయానికి వదిలేయాలి. సినిమాలోనూ పవన్ గారు ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు.

* మగువా మగువా పాట హిందీలో లేదు. మహిళల మీద ఈ పాట చేయడం సినిమాలో చేసిన మంచి మార్పు. మగువా పాట విన్నప్పుడు మీ ఫేస్ లో ఒక సంతోషం వస్తుంది. ఈ సాంగ్ కోసం చాలా మాంటేజ్ లు షూట్ చేశాం. వాటిలో బెస్ట్ అనిపించుకున్నవి పాటలో పెట్టాం. పింక్ హిందీ, తమిళ చిత్రాల్లో మగువా లాంటి పాట ఉండదు.

* ట్రైలర్ లో మీరు చూసిన సీన్ చేశాక పవన్ గారు క్లాప్ కొట్టి నన్ను అప్లాజ్ చేశారు. సాధారణంగా పవన్ గారు ఎక్స్ ప్రెసివ్ గా ఉండరు. కానీ ఆయన ప్రశంసించాక సంతోషం కలిగింది.

* ప్రీమారిటల్ సెక్స్ అనేది వ్యక్తిగత విషయం. వారి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచనలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఫెమినిజం అనే విషయాన్ని గుడ్ వేలో వాడితే మంచిదనేది నా ఉద్దేశం. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిలో వకీల్ సాబ్ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుందని చెప్పగలను. తెలుగు, తమిళంలో కొన్ని ఎగ్జైటింగ్ చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను.

* ఏ నాయికైనా తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనే దానిపై ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్ లో ఎప్పుడూ గ్యాప్ రాలేదు. నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్ లోనూ అలాగే కంటిన్యూ చేస్తున్నాను.” అని తెలిపింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =