యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య “, లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఫామిలీ ఎంటర్ టైనర్ “వరుడు కావలెను “మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగశౌర్య హీరోగా కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న “లక్ష్య “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న మొట్టమొదటి చిత్రంగా “లక్ష్య “మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో పాత్రకై హీరో నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ ను సాధించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన నాగశౌర్య ఫస్ట్ లుక్ , నాగశౌర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: