పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న “ఆదిపురుష్ “, “సలార్ ” మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ప్రభాస్ హీరోగా టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పౌరాణిక నేపథ్యం లో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడు గా నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ లో సీతగా కృతి సనన్ ఎంపిక అయ్యారు .“ఆదిపురుష్ “మూవీ ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ లో హీరో ప్రభాస్ పాల్గొంటున్నారు. రామాయణం ను ఎన్ని సార్లు తెరకెక్కించినా ప్రేక్షకాదరణ ఎల్లప్పుడూ ఉంటుంది. “ఆదిపురుష్ “మూవీ లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను శ్రీ రామ నవమి (ఏప్రిల్ 21 ) కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. రాముడి పాత్రను హీరో ప్రభాస్ పోషిస్తుండడం తో ప్రేక్షక , అభిమానులలో ఆసక్తి నెలకొంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: