టాలీవులో ఇప్పుడు కొత్త కొత్త కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. పెద్ద పెద్ద హీరోలు కూడా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఎవరు కాస్త డిఫరెంట్ గా కొత్తగా కథను తెస్తే వారితో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త కాంబినేషన్ లో సినిమా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ కాంబినేషన్ నాగచైతన్య-తరుణ్ భాస్కర్ ది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆతరువాత వచ్చిన ఈనగరానికి ఏమైంది సినిమాతో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆతరువాత వెంకీ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇంత వరకూ ఈసినిమా పై ఎలాంటి అప్ డేట్ లేదు. మరోవైపు వెంకీ F3, దృశ్యం 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇక ఈగ్యాప్ లో తరుణ్ చైతు కోసం ఒక లవ్ స్టోరీ సిద్దం చేసినట్టు తెలుస్తుంది. ఇక చైతు కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది అంటున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.
ప్రస్తుతం నాగచైతన్య్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేయనున్నాడు. మరి ఈసినిమా అయిపోయిన తరువాత తరుణ్ తో సినిమా చేస్తాడేమో చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: