మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క ఆచార్య సినిమా చేస్తూనే మరోపక్క మూడు సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ఇక దీని తర్వాత మెహర్ రమేష్ తో ఆతర్వాత బాబితో సినిమాలు చేయనున్నాడు. ప్రస్తుతం అయితే ఆచార్య షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీనితో లూసిఫర్ రీమేక్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా పూజా కార్యక్రమాలు ముగించుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట డైరెక్టర్ మోహన్ రాజా. చిరు సూచనలు, సలహాలు మేరకు తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశాడట. ఇక స్క్రిప్ట్ కూడా చిరుకు ఓకే అవ్వడంతో ఇక సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ లో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.
కాగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో సుహాసిని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం చిరు కొరటాలతో ఆచార్య సినిమాతో బిజీ గా ఉన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మే 13న ఈసినిమా రీలిజీ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: